

మన న్యూస్, కావలి: *కావలి ఎమ్మెల్యే పై హత్యాయత్నానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే ను అరెస్ట్ చేయాలి *అంబేద్కర్ విగ్రహం ఎదుట బైటాయించిన టిడిపి నేతలు*అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ.కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పై హత్యాయత్నానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు డిమాండ్ చేశారు. కావలి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. టిడిపి నేతల నిరసన కార్యక్రమంతో గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి అన్నవరం క్వారీ వద్దకు వస్తున్నారన్న సమాచారం అందుకొని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు హత్యాయత్నానికి రెక్కీ నిర్వహించారని తెలిపారు. మారణాయుధాలతో దాడి చేయాలని, డ్రోన్ల సహాయంతో ఎమ్మెల్యే ని కనిపెట్టాలని కుట్ర పన్నడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే కార్యక్రమం మారిపోవడం, క్వారీకి వెళ్లక పోయేసరికి ప్రమాదం తప్పిందని, అక్కడ ఉన్న సిబ్బందిపై దాడికి దిగడం జరిగిందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మాజీ ఎమ్మెల్యే అనుచర్ల చేతిలోని మారణాయుధాలను, వారి అనుచరులు కొంతమందిని అదుపులో తీసుకోవటం జరిగిందని తెలిపారు. నిందితులు కొంతమంది మాత్రమే దొరకటం జరిగిందని, మరి కొంతమంది పారిపోవటం జరిగిందని తెలిపారు. ఈ ఘటన వెనుక ఉన్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ని, అలాగే ఈ ఘటతో ప్రమేయం ఉన్న వారి అనుచరుల మొత్తాన్ని అరెస్ట్ చేయాలన్నారు. ప్రశాంతమైన కావలిని హత్యా రాజకీయాలకు నిలయం చేస్తారా? అంటూ రెక్కీ ఘటనపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి హింసాత్మక, విధ్వంసక ఆలోచనలు ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదకరమంటు ఆయన ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టిడిపి అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య, కండ్లగుంట మధుబాబు నాయుడు, కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవులb రామకృష్ణ, మహాజన సైన్యం సురేంద్ర, పెద్ద ఎత్తున తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



