

మన న్యూస్, నెల్లూరు రూరల్ :నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్, ఉమ్మారెడ్డి గుంట లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 21వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజల గుండెచప్పుడుగా పనిచేయాలి అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.ఈ డివిజన్లో ప్రజలకు ఎవరికైనా కష్టం, బాధ మరియు ఆపద వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు మనకు అండగా ఉంటారు అనే భరోసా కల్పించండి అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. 21వ డివిజన్ చాలా పెద్దప్రాంతం. సామాన్య, మధ్యతరగతి, పేద కుటుంబాలు ఎక్కువగా నివసించే ప్రాంతం. ఈ ప్రాంత ప్రజలందరికి ఈ కార్యాలయం ఎప్పుడూ అందుబాటులో ఉండేవిధంగా ఉండాలి అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. 21వ డివిజన్లో ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఉమ్మారెడ్డి గుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది. అక్కడికి వెళితే మనకు సమాధానం చెబుతారు, పరిష్కారం దొరుకుతుంది అనేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేదిక కావాలి అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో 21వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు చాన్ భాష, టిడిపి నాయకులు కంటే సాయి బాబా, కోటిరెడ్డి, ఖాదర్ భాష, కృష్ణమోహన్ రెడ్డి, కృపారావు, ప్రకాష్, మణికంఠ, చోటు, సురేష్, కొప్పు స్వామి, అన్నం సురేష్, మురళి, రాజేష్, చిన్న ప్రసాద్, తుపాకుల లక్ష్మి, సుమలత, డేగ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

