

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) వ్యవసాయ యాంత్రికరణ పథకం కింద ఈ సంవత్సరం రైతులకు ప్రభుత్వం రాయితీతో వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేస్తుందని మండల వ్యవసాయ అధికారి నవ్య తెలిపారు.అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ-ఎస్టీ రైతులు, మహిళా రైతులు, ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన వారికి 50 శాతం రాయితీ, ఇతర రైతులకు 40 శాతం రాయితీ వర్తించనుంది.
ఈ పథకంలో భాగంగా మండలానికి బ్యాటరీ స్ప్రేయర్లు 160, పవర్ స్ప్రేయర్లు 24, రోటవేటర్లు 10, సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్స్ 3, కల్టివేటర్లు, డిస్క్ హారోలు, ఎంబీ నాగళ్ళు, కేజీవీల్స్, రోటో ఫ్లూడర్లు 13, బండ్ ఫార్మర్ 1, బ్రష్ కట్టర్లు 3, పవర్ టిల్లర్ 1, స్ట్రాబెలర్లు 2 లభ్యమని ఆమె వివరించారు.రాయితీ పొందదలచిన రైతులు దరఖాస్తు ఫారమ్‌తో పాటు పట్టాదారు పాసుబుక్, ఆధార్ కార్డు, ట్రాక్టర్ ఆర్‌సి, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు సమర్పించి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.