

మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 12 :దేశంలో ఉండే కూటమిలు రెండు ఒకటి ఇండియా కూటమి, రెండు ఎన్డీఏ కూటమి. జగన్ ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నాడా? ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాడా? ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు అని అన్నారు. 2024 లో అప్రజాస్వామ్యంగాజరిగిన ఎన్నికలలో పోలైన ఓట్లకు ,కౌంటింగ్ ఓట్లకు తేడా 12.5 పర్సెంట్ ఉంటే అడిగే ధైర్యం, దమ్ము జగన్కు లేదు అని అన్నారు. ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ సర్వే చేసి ఎలక్షన్ కమిషన్ కమిషన్కు రిపోర్ట్ ఇస్తే దాని పై జగన్ నోరు కూడా తెరవని పరిస్థితి అని అన్నారు.జగన్ చేసిన అవతకులు ఎక్కడ బయటపడతాయని భయపడి నోరు మెదపడం లేదు. రాష్ట్రంలో దేశంలో నరేంద్ర మోడీని ఎదిరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు. కనుక పాత కాంగ్రెస్ శ్రేణులు సొంత కూటికి రావాలని పిలుపునిచ్చారు.ప్రజల పట్ల ,ప్రజల సమస్యల పట్ల పోరాడే పార్టీ కాంగ్రెస్ ,దానికి సమర్ధులు దేశంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో షర్మిలకే ఉంది అని అన్నారు. ఇంకా రాష్ట్రంలో చంద్రబాబు పాలన గురించి మాట్లాడితే …రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్న ఎలాంటి కొత్త పెన్షన్ లేదు, కొత్త కాలనీ లేదు సంక్షేమ పథకాలు అసలే లేవు అని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన వాగ్దానాలు ఇంకా చాలా ఉన్నాయి అని అన్నారు. జగన్ చేసిన జిల్లాల విభజన ,ఇప్పుడు చంద్రబాబు కూడా చేస్తున్నాడు అని అన్నారు.దేశంలో ఎన్నికలలో జరిగిన అవకతవకలు గురించి విపక్ష పార్టీ చెందిన 300 మంది ఎంపీలను ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ ఇవ్వడానికి వెళితే వారిని అరెస్టు చేసిన ఘనత ఎన్డీఏ కూటమిది అని అన్నారు. కనుక రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంది .అర్హత రాహుల్ గాంధీ షర్మిల లకే ఉంది అని అన్నారు.
