

- రాజేష్ సేవలను గుర్తించిన జేజిఆర్ హాస్పిటల్ యాజమాన్యం…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామీణ వైద్యులు బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రచార సహాయ కార్యదర్శి రాజాన రాజేష్ పార్వతి దంపతులకు జేజిఆర్ హాస్పిటల్ యాజమాన్యం ఘనంగా సన్మానం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం జేజిఆర్ హాస్పిటల్ లో బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో గ్రామీణ వైద్యులు రాజాన రాజేష్ పార్వతి దంపతులకు జేజిఆర్ హాస్పటల్ డాక్టర్ జోగ వీర బాలాజీ, డాక్టర్ జోగా శ్రీలత మరియు రాష్ట్ర అధ్యక్షులు కరెళ్ళ గణపతి రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధన్యుని సత్యనారాయణ (కోటిబాబు) చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేశారు. ఈ సమావేశంలో బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కరెళ్ళ గణపతి రావు మాట్లాడుతూ రాజాన రాజేష్ పార్వతి దంపతులు గ్రామీణ వైద్యులుగా మండపం, పారుపాక, అన్నవరం గ్రామాలలో వైద్య సేవలు అందిస్తూ గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నారని. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా ఫోన్ చేస్తే ఇంటికి వెళ్లి తన వంతు వైద్య సేవలు అందిస్తున్నారని మరియు కరోనా సమయంలో గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించడమే కాకుండా ఉచితంగా కూరగాయలు, భోజనాలు, మజ్జిగ, మంచినీరు వంటి పంపిణీ కార్యక్రమాలు చేసిన గ్రామీణ వైద్యులు రాజాన రాజేష్ పార్వతి దంపతులకు సన్మానం చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులకు పిఠాపురం జేజిఆర్ హాస్పిటల్ డాక్టర్స్ , డాక్టర్ జోగా వీర బాలాజీ (ఎం.డి, జనరల్ మెడిసిన్, గోల్డ్ మెడలిస్ట్ ),
డాక్టర్ శ్రీమతి జోగా శ్రీలత (ఎం.బి.బి.ఎస్, డి జి ఓ)గార్లచే సీజనల్ వ్యాధులు పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమం నకు బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధన్యుని సత్యనారాయణ (కోటిబాబు) రాష్ట్ర కోశాధికారి యండపల్లి నాగేశ్వరరావు, రాష్ట్ర అభివృద్ధి కమిటీ చైర్మన్ మల్లాడి ఈశ్వరరావు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్రపు వినోద్ కుమార్. గ్రంధి వెంకటరమణ, దాసు, సతీష్, డాక్టర్ వైయస్ మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. మండలాల అధ్యక్ష కార్యదర్శులు, సుమారు 200 మంది బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.