కృష్ణా జిల్లాలో కానూరు శాఖను ప్రారంభించిన ఐసిఐసిఐ బ్యాంక్

మన న్యూస్ ,విజయవాడ, ఆగస్టు 6: ఐసీఐసీఐ బ్యాంక్ కృష్ణా జిల్లాలోని కానూరులో (విజయవాడ వద్ద) 100 ఫీట్ రోడ్డులో కొత్త శాఖ ఏర్పాటు చేసింది. జిల్లాలో 18వదైన ఈ శాఖలో ఏటీఎం కూడా ఉంది. ఈ శాఖలో ఏటీఎం 24x 7 అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ A.O. బషీర్ ఈ శాఖను ప్రారంభించారు. సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్, ఫిక్సిడ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ మరియు గృహ, వ్యక్తిగత, వాహన, వ్యాపార, విద్యా రుణాలు, రెమిటెన్సులు మరియు కార్డ్ సర్వీసులతో పాటు సమగ్రమైన అకౌంట్స్, డిపాజిట్స్ సేవలను కూడా ఈ శాఖ అందిస్తుంది. ఇది సోమవారం నుంచి శుక్రవారం వరకు, అలాగే నెలలో మొదటి, మూడో, అయిదో శనివారాల్లో ఉదయం 9.30 గం.ల నుంచి సాయంత్రం 3 గం.ల వరకు పని చేస్తుంది. ఈ బ్రాంచీలో ట్యాబ్ బ్యాంకింగ్ సదుపాయం కూడా ఉంటుంది. కస్టమర్ల ప్రాంగణంలోనే ట్యాబ్లెట్ డివైజ్ ద్వారా బ్యాంకు ఉద్యోగి దాదాపు 100 సర్వీసులను అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అకౌంట్లు, ఫిక్సిడ్ డిపాజిట్లు తెరవడం సహా, చెక్ బుక్ కోసం దరఖాస్తు చేసుకోవడం, ఈ-స్టేట్‌మెంట్స్ జనరేషన్, చిరునామా మార్పు మొదలైన సేవలు వీటిలో ఉంటాయి.  ఐసీఐసీఐ బ్యాంక్‌నకు ఆంధ్రప్రదేశ్‌లో 260 పైగా శాఖలు, 400 పైగా ఏటీఎంలు మరియు క్యాష్ రీసైక్లింగ్ మెషిన్ల (సీఆర్ఎం)  నెట్‌వర్క్ ఉంది. శాఖలు, ఏటీఎంలు, కాల్ సెంటర్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ (www.icicibank.com), మొబైల్ బ్యాంకింగ్ లాంటి మల్టీ చానల్ డెలివరీ నెట్‌వర్ ఐసీఐసీఐ బ్యాంక్ విస్తృత స్థాయిలో కస్టమర్లకు సేవలు అందిస్తోంది.  

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు