మన న్యూస్ ,విజయవాడ, ఆగస్టు 6: ఐసీఐసీఐ బ్యాంక్ కృష్ణా జిల్లాలోని కానూరులో (విజయవాడ వద్ద) 100 ఫీట్ రోడ్డులో కొత్త శాఖ ఏర్పాటు చేసింది. జిల్లాలో 18వదైన ఈ శాఖలో ఏటీఎం కూడా ఉంది. ఈ శాఖలో ఏటీఎం 24x 7 అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ A.O. బషీర్ ఈ శాఖను ప్రారంభించారు. సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్, ఫిక్సిడ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ మరియు గృహ, వ్యక్తిగత, వాహన, వ్యాపార, విద్యా రుణాలు, రెమిటెన్సులు మరియు కార్డ్ సర్వీసులతో పాటు సమగ్రమైన అకౌంట్స్, డిపాజిట్స్ సేవలను కూడా ఈ శాఖ అందిస్తుంది. ఇది సోమవారం నుంచి శుక్రవారం వరకు, అలాగే నెలలో మొదటి, మూడో, అయిదో శనివారాల్లో ఉదయం 9.30 గం.ల నుంచి సాయంత్రం 3 గం.ల వరకు పని చేస్తుంది. ఈ బ్రాంచీలో ట్యాబ్ బ్యాంకింగ్ సదుపాయం కూడా ఉంటుంది. కస్టమర్ల ప్రాంగణంలోనే ట్యాబ్లెట్ డివైజ్ ద్వారా బ్యాంకు ఉద్యోగి దాదాపు 100 సర్వీసులను అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అకౌంట్లు, ఫిక్సిడ్ డిపాజిట్లు తెరవడం సహా, చెక్ బుక్ కోసం దరఖాస్తు చేసుకోవడం, ఈ-స్టేట్మెంట్స్ జనరేషన్, చిరునామా మార్పు మొదలైన సేవలు వీటిలో ఉంటాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌నకు ఆంధ్రప్రదేశ్‌లో 260 పైగా శాఖలు, 400 పైగా ఏటీఎంలు మరియు క్యాష్ రీసైక్లింగ్ మెషిన్ల (సీఆర్ఎం) నెట్వర్క్ ఉంది. శాఖలు, ఏటీఎంలు, కాల్ సెంటర్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ (www.icicibank.com), మొబైల్ బ్యాంకింగ్ లాంటి మల్టీ చానల్ డెలివరీ నెట్వర్ ఐసీఐసీఐ బ్యాంక్ విస్తృత స్థాయిలో కస్టమర్లకు సేవలు అందిస్తోంది.