

మండల కన్వీనర్ రామిశెట్టి నాని
శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- ప్రత్తిపాడు మండలంలో తోటపల్లి గ్రామం లో ప్రసిద్ధిగాంచిన దార మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మాజీ మంత్రి వైసీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని మండల వైసిపి కన్వీనర్ రామిశెట్టి నాని తెలిపారు.మండలంలో వెంకటనగరం పంచాయతీ శివారు తోటపల్లి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన దార మల్లికార్జున స్వామి కి గిరిజన మహిళలు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల కన్వీనర్ రామిశెట్టి నాని మాట్లాడుతూ, ప్రతిపాడు నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాల కాలం నుండి చేసిన ముద్రగడ పద్మనాభం చేసిన సేవలను గుర్తు చేశారు. నియోజకవర్గానికి నీతి నిజాయితీతో పరిపాలన అందించి అవినీతి లేని పాలన అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన నాయకుడు ముద్రగడ పద్మనాభం అని ముద్రగడ పద్మనాభం ప్రజలందరూ అభిమానాలతో, మల్లికార్జున స్వామి ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గొల్లపల్లి దొరబాబు, మాజీ సర్పంచ్ కోరాపు గంగరాజు, యెనుముల దొరబాబు, సింహాద్రి కుమార్, కోరాపు చక్రం, తెడ్ల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.