

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- సమాజంలో కళాకారులును ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మండల వైసీపీ కన్వీనర్ రామిశెట్టి నాని అన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని రౌతుపాలెం సాయినాధుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు గ్రామానికి చెందిన శ్రీ కృష్ణ నంద బాల భక్త భజన సమాజం ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. భజన కళాకారుడు సత్యంశెట్టి అమ్మన్న ను మండల కన్వీనర్ రామిశెట్టి నాని గ్రామస్తులు శాలువా, పూల మాల వేసి సత్కరించారు. నాని మాట్లాడుతూ గ్రామాల్లో కళాకారులను గౌరవించుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని సమాజంలో కళాకారులను ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గ్రామీణ ప్రాంతాల్లో కళాకారులకు ఒకప్పుడు ఎంతో గుర్తింపు ఉండేదని ప్రస్తుత తరుణంలో కళాకారులను గుర్తించడం లేదని కళాకారులను మనందరం కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ధర్మపూడి శేషు, గోళ్ళ తేజ, కరుసూదుల శేఖర్, సత్యం శెట్టి సాయి చరణ్, కోలా వెంకటేశ్వరావు,బర్రె బుల్లికాపు, చీకట్ల తాతీలు తదితరులు పాల్గొన్నారు.