


మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నేటి సమాజంలో మానవ మనుగడకు చెట్లే జీవనాధారమని జుక్కల్ ఎమ్మేల్యే తోట లక్ష్మికాంతారావు పేర్కొన్నారు.జుక్కల్ నియోజక వర్గ పర్యటనలో భాగంగా మండలంలోని జగన్నాద్ పల్లి శివారులో వన మహోత్సవాన్ని పురస్కరించుని అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా తోట మాట్లాడుతు..మానవ మనుగడకు చెట్లు చాలా ప్రాధాన్యమైనమని తెలి పారు. గతంలో రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం అధికంగా సమయంలో విరి విగా వర్షాలు కురిసేవని, ప్రస్తుతం అడవులు తగ్గడం వలన వర్షాలు సకాలంలో కురియడం లేదన్నారు. దీంతో వర్షాలు సకాలంలో కురియక పోవడం వలన అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. అంతే గాక మొక్కలు పెంచడం వలన వర్గాలతో పాటు స్వచ్చమైన గాలి లబిస్తే మానవుని జీవన ప్రమాణం పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడే బాధ్యతలో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షిం చుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మహేం దర్ రెడ్డి, ఎపిడివో సునీత, పారెస్ట్ రేంజ్ అధికారులు రవికుమార్, సంతోష,డిఆర్వోలు రఘుపతి స్వామి, సుజాత, అభిలాష్, సిబ్బంది సంతోష్,తదితరులు ఉన్నారు.
