

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, ఏజెన్సీ లో పూర్వం నుండి నివసిస్తున్న నేతకాని కులస్తులకు ఏజెన్సీ చట్టాలు పూర్తి గా అమలు చేయాలని తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది దుర్గం మారుతి నేత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బుధవారం నాడు రాళ్ళ వాగు పెద్దమ్మ తల్లి గుడి వద్ద నేతకాని చైతన్య సభ ఆ సంఘం జిల్లా ఇంచార్జీ జాడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం మారుతి మాట్లాడుతూ ఏజెన్సి లో నివసిస్తున్న మా కులస్తులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చట్టాలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని, మా కులస్తులకు హక్కులు లేక భూమి పై, భుక్తి పై హక్కులు లేక జీవచ్చంలా బ్రతుకుతున్నారని, ఇకనైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ మొండి వైఖరిని , నిర్లక్ష్యాన్ని విడనాడాలని, మా కులస్తులకు, 1/70, పీసా చట్టాలు పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సీనియర్ నాయకులు దుర్గం రమణయ్య, కోట రాజలింగం మాట్లాడుతూ మా కులస్తులకు ఏజెన్సీ చట్టాలు వర్తింప చేయాలని, పూర్వం నుండి ఇక్కడే నివసిస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయని కానీ మాకు చట్టాలు ఎందుకు వర్తిమజేయటం లేదో అర్థం కావడం లేదని , ఇకనైనా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని మా కులస్తులకు హక్కులు కల్పించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అలాగే ఈ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి ఈశ్వర్ నేతకాని మాట్లాడుతూ ఏజెన్సీ లో మనకు హక్కులు కావాలంటే ప్రజలందరు ఐక్యతతో ఉద్యమాలకు సిద్ధం కావాలని, ఇకనైనా సమిష్టి తితో ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ నేతకాని సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమాలే శరణ్యం అని, ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం జిల్లా ఇంచార్జీ జాడి శ్రీనివాసరావు, జాడి పద్మ, కొండగుర్ల కోటేశ్వరరావు, దుర్గం కోటేశ్, రాష్ట్ర నాయకులు కాదు రాజు, జాడి నరేంద్ర, జాడి నాగరాజు, గంధర్ల నిత్యానంధం, పెగ నరేష్, తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం జిల్లా, మండల , గ్రామ నాయకులు, కుల పెద్దలు అందరూ పాల్గొన్నారు.