

ఇబ్బంది పడుతున్న రైతులు…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి :- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం లోని కొంతంగి కొత్తూరు రైతు భరోసా కేంద్రం లో అగ్రికల్చర్ అసిస్టెంట్ అందుబాటులో లేక రైతులు ఇబ్బంది. తరచూ అగ్రికల్చర్ అసిస్టెంట్ విధులకు డుమ్మా కొడుతున్నాడు. కార్యాలయం లో ఏ రోజు డ్యూటీ లో ఉంటాడో తెలియడం లేదు. రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే ఎరువులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పధకం ఆన్లైన్లో పేర్లు లేని రైతులు తమ పిర్యాదులను ఈరోజు (సోమవారం ) పట్టాదారు పాసుపుస్తకం నకలు, ఆధార్ కార్డు నకలు కాపీలతో గ్రీవెన్స్ లో ఇద్దామని చాలా మంది ఎదురు చూస్తుంటే అగ్రికల్చర్ అసిస్టెంట్ తరుణ్ జాడ ఎక్కడ కనపడలేదు. సరే రైతుల సమస్యలు అగ్రికల్చర్ ఆఫీసర్ కి చెప్పుకుందాం అనుకుంటే ఆయన ఫోన్ ఎత్తరు ఇలాగైతే ప్రభుత్వ పధకాలు ప్రజలకు ఎలా చేరతాయని జనసేన నాయకులు డివిజనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యులు గొర్లి నాగేశ్వరావు ఆవేదన వ్యక్తం చేసారు.