మన న్యూస్ పాచిపెంట, జూన్ 29 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట,అధిక ధరలుకు ఎరువులు విక్రయించి రైతులను మోసగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పాచిపెంట మండల వ్యవసాయ శాఖ అధికారి కొల్లి తిరుపతి రావు ఎరువుల దుకాణాల డీలర్లను హెచ్చరించారు. ఆదివారం నాడు ఆయన పాచిపెంట గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎరువుల డీలర్లు రైతులను ఇబ్బంది పెట్టవద్దని రైతులు రైతులకు ఉపయోగము లేని ఎరువులను బలవంతంగా అంటగట్ట రాదని వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు సూచించారు. స్థానిక కృష్ణ ఎరువుల డిపో లో ఎరువుల పంపిణీ పరిశీలించారు.ఈ సందర్భంగా పి కొనవలస రైతు కొట్టాడా సత్యనారాయణ మాట్లాడుతూ ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేటట్లు చూడాలని దుకాణదారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎరువులతో పాటు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని కోరారు.రైతుకు ఇచ్చే ఎరువుల ఉపయోగాలను కూడా రైతుకు తెలియజేయాలని రైతు ఏ పంటకు, ఏ ఎరువు తీసుకు వెళుతున్నాడో కనుక్కొని సరియైన ఎరువులు మాత్రమే రైతుకు అందజేయాలని సూచించారు.రికార్డులు పక్కాగా నిర్వహించాలని లేనియెడల చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిపారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని వ్యవసాయ శాఖ అధికారి తిరుపతిరావు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *