గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరు మండలంలోని రైటర్ సత్రం గిరిజన కాలనీలో మహేశ్వరి అనే ఇంటర్ విద్యార్దిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.విద్యార్దిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిల్లకూరు మండలంలోని రైటర్ సత్రం గిరిజన కాలనీకి చెందిన మహేశ్వరి గూడూరులోని ఓ ప్రవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది.. తండ్రి,నానమ్మ వద్ద ఉంటోంది.ఏమి జరిగిందో..ఏమో కానీ..ఆ విద్యార్దిని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.సూసైడ్ నోట్ కూడా రాసింది..తన చావుకు ఎవరూ కారణం కాదని, తండ్రి బాధపడవద్దని అందులో రాసుకొచ్చింది.ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.సంఘటన స్దలికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.శవ పంచనామా నిమిత్తం మ్రుత దేహాన్ని గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *