మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమార్తె తోట జసింత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) నుంచి పట్టభద్రులైన సందర్భంగా సీఎం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తోట జసింత లాంటి యువతులు తెలంగాణకు గర్వకారణం. అంతర్జాతీయ స్థాయి విసంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి ఎంతో స్పూర్తిదాయకం. పట్టుదల,కృషి చూసి అభినందించకుండా ఉండలేను.భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు.ఈ సందర్భంగా తోట జసింత, సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చంతో మర్యాదపూర్వకంగా అభివందనలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం నివాసంలో సౌహార్దపూర్వక వాతావరణంలో భేటీ జరిగింది. సీఎం హస్తాక్షరాలతో అభినందనల సందేశాన్ని అందించడం కుటుంబ సభ్యుల్లో హర్షాతిరేకాన్ని కలిగించింది.
తోట జసింత విజయం జిల్లాలోని యువతికి స్ఫూర్తిగా నిలుస్తోంది.చిన్న పట్టణాల నుంచి వచ్చిన వారు కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విద్యాసంస్థల వరకు చేరవచ్చునని ఈ విజయం నిరూపిస్తోంది.తల్లిదండ్రుల ప్రోత్సాహం,విద్యార్థినిగా జసింత కృషి కలిసి ఈ గొప్ప ఫలితాన్ని తెచ్చినట్లు స్థానిక ప్రజలు తెలుపుతున్న అభినందనలు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *