మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి 3వ తరగతి ఉత్తీర్ణులైన బాలబాలికలకు రాష్ట్రంలోని హకీంపేట్,కరీంనగర్, ఆదిలాబాద్ లలో ఉన్న క్రీడా పాఠశాలల్లో చేరుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి తిరుపతి రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి 19 వ తేదీ వరకు గవర్నమెంట్ హై స్కూల్ నిజాంసాగర్ నందు ఆసక్తి గల విద్యార్థులు ధరఖాస్తులు చేసుకోవాలని ఆయన తెలిపారు. 19 వ తేదీ ఉదయం 9:30 నుండి ఫిజికల్, మెడికల్ పరీక్షలు నిర్వహించబడుతాయని ఆయన అన్నారు. మండలం నుండి పది మంది బాలురు, పదిమంది బాలికలను ఎంపిక చేసి జిల్లా కేంద్రానికి పంపడం జరుగుతుందని, జిల్లాలో ఈనెల 23 నుంచి అక్కడ అర్హులైన విద్యార్థులు ఎంపిక జరుగుతుందని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు గవర్నమెంట్ హై స్కూల్ నిజాంసాగర్ ఫిజికల్ డైరెక్టర్ ఉపాధ్యాయులు వెంకట్ ను సంప్రదించాలని ఆయన తెలిపారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *