ఇన్చార్జి ఉన్నారో లేదో తెలియదు..

చిన్న చిన్న పనులు మాత్రమే చేస్తా.

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి విధులకు సెలవు పై వెళ్లడంతో హసన్ పల్లి గ్రామపంచాయతీకి ఏ పంచాయతీ కార్యదర్శి ఇన్చార్జ్ ఇచ్చారు తెలియని పరిస్థితిలో గ్రామస్తులు ఉన్నారు.వీధుల గుండా చేత్తను సేకరించే టాక్టర్ రాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎక్కడి చెత్త అక్కడ నిండిపోవడంతో దుర్వాసన వస్తుంది గ్రామస్తులు అసహనాన్ని వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి విధులకు సెలవు పై వెళ్లడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి ప్రణీత్ ను వివరణ చరవాని ద్వారా వివరణ కోరగా.. నాకు పూర్తి బాధ్యతలు ఇప్పటివరకు అప్పజెప్పలేదని చిన్నచిన్న పనులు మాత్రమే నేను చేస్తానని ఆయన మన న్యూస్ కు తెలియజేశారు. ఇదండీ అధికారుల పనితీరు ఎలా ఉందో ప్రజలు గమనించగలరు ఇప్పటికైనా కార్యదర్శిని నియమిస్తారు లేదా ఇన్చార్జి పూర్తి బాధ్యతలు ఇస్తారో వేచి చూడాల్సిందే.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *