వానోస్తే కష్టమే.. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరంలో వానొస్తే కష్టమవుతోంది. టౌన్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మెయిన్ రోడ్లు, కాలనీల్లో సరైన డ్రైనేజీలు లేక వానలు కురిస్తే వరదనీళ్లు రోడ్లపైనే నిలుస్తున్నాయి.పట్టణంలోని పలు ప్రాంతాలలో ఇండ్ల మధ్య వర్షపు నీరు వచ్చి చేరుతోంది. వర్షాలు కురిసినప్పుడల్లా నిత్యం జనాలతో రద్దీగా ఉండే ప్రధాన రోడ్లతో పాటు, పలు కాలనీల్లో రోడ్లు చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి.టౌన్లో రోజురోజుకు జనాభా పెరుగుతోంది. అందుకనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏటా సుమారు లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నా, ప్లానింగ్, పర్యవేక్షణ లేక పనులు పూర్తయిన మున్నాళ్లకే అవి శిథిలమవుతున్నాయి. మున్సిపాలిటీలో సుమారు 23 వేలు జనాభా నివసిస్తుండగా, నిత్యం వివిధ అవసరాల నిమిత్తం మరో 10 వేలకు పైగా జనం వచ్చిపోతుంటారు. బస్టాండ్ నుంచి బాలాజీ చౌక్, నర్సీపట్నం రోడ్డు, కాలేజీ రోడ్, ఎర్రవరం రోడ్డు, ఈ ఏరియాలో వ్యాపార సంస్థలు అధికంగా ఉంటాయి. ఏలేశ్వరం కి రాకపోకలకు ఈ రోడ్లుప్రధానమైనవి. ఈ ఏరియాల్లో చిన్నపాటి డ్రైనేజీ వ్యవస్థ ఉంది. అది కూడా మూసుకుపోయింది. రోడ్కు రెండు పక్కల పెద్ద డ్రైనేజీతో పాటు, వీధుల్లో కాలవల పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తీసేందుకు పనులు చేస్తున్నారు. పనులు ప్రారంభించి సుమారు 15 రోజులు కావొస్తున్నా ఇప్పటికీ కంప్లీట్గా అవలేదు. ఏలేశ్వరం లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ప్రతీ వానాకాలంలో వరద నీరు రోడ్పై నిలిచి ఇబ్బందులు పడుతున్నా, అధికారులు మాత్రం నివారణ చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏలేశ్వరం ఈ రోడ్డుపై. నిత్యం వేల సంఖ్యలో వెహికల్స్ రాకపోకలు సాగిస్తాయి. రోడ్కు ఇరుపక్కలా దశబ్దాల కింద చిన్న డ్రైనేజీని నిర్మించారు.ప్రస్తుతం అది ముసుకుపోయింది. వానలు కురిస్తే రోడ్పైనే నీళ్లు నిలిచి చిన్నపాటి కుంటలను తలపిస్తాయి. దీంతో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం వచ్చిన ప్రతీసారి ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. రోడ్కు రెండు పక్కలా పెద్ద డ్రైనేజీ నిర్మించాల్సి ఉన్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.ఇది ఏలేశ్వరం ఎర్రవరం ప్రధాన రహదారి కావడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోజూ వేలల్లో వాహనాలు అటుఇటు తిరుగుతాయి. ఈ రోడ్ లో బాలాజీ చౌక్ లింగవరం కాలనీ వరకు డ్రైనేజీ సరిగా లేదు. వానాకాలంలో రోడ్పైనే నీళ్లు నిలుస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..