

మన న్యూస్ ,నెల్లూరు ; కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని నెల్లూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.ఓటమిపాలనలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరసిస్తూ మంగళవారం నెల్లూరు నగరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలియజేశారు.అనంతరం జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో నిత్యం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు,హత్యలను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ మహిళలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆమె తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ సునంద,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా రాష్ట్ర కార్యదర్శి,నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి,నాయుడుపేట వైస్ ఎంపీపీ కృష్ణవేణి,పలువురు ఎంపీపీలు,వైయస్ ఎంపీపీలు వైసిపి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు,అసెంబ్లీ నియోజకవర్గ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
