

మన న్యూస్, నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ పరిధిలోని స్థానిక బీవీనగర్ సెంటర్ సమీపంలో లిటిల్ విల్లే స్కూల్ ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. స్కూల్ లో చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని సూచించారు. ఈ సందర్భంగా లిటిల్ విల్లే కరస్పాండెంట్ లావణ్య జిక్కి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో భార్య భర్తలు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. అటువంటి వారు తమ పిల్లలకు సంబంధించి ఆటపాటలతో కూడిన విద్యను అందించేందుకు లిటిల్ విల్లే అగ్రస్థానంలో ఉంటుందన్నారు. చిన్నతనం నుంచే వారికి వివిధ యాక్టివిటీస్ లో శిక్షణ ఇస్తామన్నారు. ఏసీ క్లాస్ రూమ్ లో తో పాటు వివిధ ఆట వస్తువులను అందుబాటులో ఉంచామన్నారు. ప్రాథమిక పూర్వ విద్య పాఠశాల లిటిల్ విల్లే ను ప్రతి ఒక్కరు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అడ్వైజర్ తో పాటు స్థానిక కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి, ఒరిస్సా శ్రీనివాస్ రెడ్డి, కోటిరెడ్డి, యానాది రెడ్డి, అభినాష్ , నారాయణ, ఆదినారాయణ, వెంకటా చలపతి, జగదీష్, చైతన్య, సుమలత సత్యనారాయణ, ఆదిలక్ష్మమ్మ, తులసి తదితరులు పాల్గొన్నారు.


