

మన న్యూస్, నెల్లూరు: ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రభుత్వం తీసుకువచ్చిన ఆన్ లైన్ కౌన్సిలింగ్ విధానంతో 50 వేల మంది SGT లు పడుతున్న ఇబ్బందుల పట్ల వైయస్ఆర్సీపీ ముందుకొచ్చి అన్ని విధాల ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి జరిపిన పోరాటం సత్ఫలితాన్నిచ్చింది.ఉపాధ్యాయులు, అందరూ కూడా ఏకతాటిపై నిలిచి సమిష్టిగా చేసిన పోరాట ఫలితంగా ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం దిగివచ్చి SGTలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు అంగీకారం తెలిపింది .దీని మీద వైస్సార్సీపీ చేసిన పోరాటం అందరకీ తెలిసిందే .భవిష్యత్తులో ఉపాధ్యాయులు జరిపే పోరాటాల్లో ఉపాధ్యాయులకు వైఎస్ఆర్సిపి అండగా నిలిచి.. వారి సమస్యలను మా గొంతుగా చేసుకొని.. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి.. సమస్యల పరిష్కార సాధనలో ఉపాధ్యాయులకు తోడుగా నిలుస్తానని ఉపాధ్యాయ MLC .పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి (శాసనమండలి సభ్యులు) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ తెలియజేశారు.
