జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

మన న్యూస్, నెల్లూరు:* మహిళలను కించపరిచే మాటలు మానకుంటే నాలుకలు తెగకోస్తాం.- నెల్లూరులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన తెలుగు మహిళలు.- అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించడంపై మహిళల మండిపాటు .- నల్ల చీరలు ధరించి కదం తొక్కిన మహిళామణులు .- సాక్షి పేపర్ ను, టీవీని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ .అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించటంపై తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని గాంధీ బొమ్మ నుంచి వీఆర్సీ వరకూ తెలుగు మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. నల్ల చీరలు ధరించి కదం తొక్కిన మహిళామణులు ముందుకు నడిచారు. మహిళల ఆత్మాభిమానం దెబ్బతినేలా సాక్షిని ప్రోత్సహిస్తున్న జగన్ మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ వారంతా డిమాండ్ చేశారు. ఖబర్ధార్ జగన్ అంటూ నినాదాలతో మహిళా మణులు నిరసనలు హోరెత్తించారు. అనంతరం తప్పుడు రాతలు రాసిన సాక్షిపై, తప్పుడు కూతలు కూసిన జర్నలిస్ట్ కృష్ణం రాజు, డిబేట్ నడిపిన కొమ్మినేనిపై చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు వన్ టౌన్ పీఎస్ లో మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు రేవతి మాట్లాడుతూ ….మహిళలని కించపరిచేలా వ్యవహరించిన జగన్ అండ్కో ని శిక్షించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఐదేళ్లు రాక్షసపాలన సాగించారని మండిపడ్డారు. దేవతల రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు మహిళల మనోబావాలను కించపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు. జగన్ తనం బృందంతో కారుకూతలు కుయిస్తున్నారని ఎద్దేవ చేశారు. టీడీపీ కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కొందరు కుట్రలు పన్నుతున్నారన్నారు. పదకొండు సీట్లకే ప్రజలు పరిమితం చేసినా జగన్ కి ఇంకా బుద్ధి రాలేదంటూ తనదైన శైలిలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ తీరు మారకుంటే నెక్స్ట్ ఒక్క సీటు కూడా రాదన్నారు. మహిళలను కించపరిచే మాటలు మానకుంటే నాలుకలు తెగకోస్తామంటూ హెచ్చరించారు. ఏపీ పై విషం కక్కుతున్న సాక్షిపేపర్, టీవీ లను బాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ , నగర అధ్యక్షుడు మామిడాల మధు , టిడిపి నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, కార్పొరేటర్లు, టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు