తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు 3 కోట్ల 71 లక్ష 40 వేల రూపాయలు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలిపిన శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్.అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ…….,ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామీణ యోజన పథకం(PMAGY) కింద నియోజకవర్గం లోని పంచాయతీ లలో వాటర్ ప్లాంట్, అంగన్వాడీ స్కూల్ ల నందు టాయిలెట్స్, CC డ్రైన్స్ మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు 3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు అని అన్నారు.జిల్లా ప్రజా పరిషద్ సాధారణ నిధుల ద్వారా నియోజకవర్గంలో రూరల్ వాటర్ సప్లై కింద పలు పంచాయతీ లలో బోర్లు వేయుటకు 42 లక్షల 40 వేల రూపాయలు మంజూరు చేశారు అని అన్నారు.గూడూరు పట్టణం పరిధిలో ఉన్న కోర్ట్ నందు సిబ్బందికి, దివ్యంగులకు టాయిలెట్స్ నిర్మాణం కొరకు 23 లక్షలు మరియు భవనం నందున్న వాష్ రూమ్ మరమ్మత్తులు మరియు వాటర్ సప్లై మరమ్మత్తులు కొరకు 8 లక్షల రూపాయలు మంజూరు చేశారు అని అన్నారు.నియోజకవర్గ అభివృద్ధి కొరకు 3 కోట్ల 71 లక్షల 40 వేల రూపాయలు మంజూరు చేసిన ప్రధాన మంత్రి మోదీ కి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ కి, విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ కీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *