మన న్యూస్, నెల్లూరు :నెల్లూరు 53 వ డివిజన్ వాటర్ ట్యాంక్ వీధి లో అనారోగ్యం తో బాధపడుతున్న 53 వ డివిజన్ వై సి పి సీనియర్ నాయకులు బ్రహ్మ రెడ్డి ని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి బ్రహ్మారెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని అండగా ఉంటామని మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చంద్రశేఖర్ బ్రహ్మారెడ్డి కి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి యువజనవిభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ళ కిషన్, 53 వ డివిజన్ ఇన్ చార్జ్ వెంగళ రెడ్డి,11 వ డివిజన్ ఇన్ చార్జ్ మహేష్ యాదవ్, 53 వ డివిజన్ వై సి పి నాయకులు బాలి రెడ్డి, నిర్మలమ్మ, ప్రసన్న, ప్రసాద్, 54 డివిజన్ వై సి పి సీనియర్ నాయకులు సలాం, అస్లాం,ఖయుమ్, ఖాజా బాబా, మోహిత్ వై సి పి నాయకులు సింగం శెట్టి అశోక్,బాలకృష్ణా రెడ్డి, పెంచలయ్య,సుమదర్,ఉదయ్, మీరా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *