రాజధాని అమరావతిలోని అనంతవరం లో జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా వన మహోత్సవం కార్యక్రమం.మన న్యూస్ ,అమరావతి /నెల్లూరు:రాజధాని అమరావతిలోని అనంత వారంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లోభాగంగా వణ మహోత్సవ కార్యక్రమానికిహాజరుకానున్న సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,మంత్రులు,ప్రజాప్రతినిధులు.అనంతవరం పార్క్ సమీపంలో మొక్కలు నాటనున్న సీఎం,డిప్యూటీ సీఎం.స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొంగూరు నారాయణ.ఈ సందర్భంగా రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు పొంగూరు నారాయణ మాట్లాడుతూ……..వన మహోత్సవం లో భాగంగా సీఎం,డిప్యూటీ సీఎం రేపు మొక్కలు నాటనున్నారు.ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా అమరావతి ఉండాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యం అని అన్నారు.దేశంలో ఎక్కడైనా నిర్మాణాలకు 10 శాతం బ్లూ అండ్ గ్రీన్ ఉంటుంది… కానీ అమరావతి లో 30 శాతం బ్లూ అండ్ గ్రీన్ ఉండేలా నిర్మిస్తున్నాం అని అన్నారు.భవిష్యత్తులో కనీసం 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని అన్నారు.సింగపూర్, జపాన్ తో సంప్రదించి అక్కడి మాదిరిగా మంచి ప్లాంటేషన్ ఉండేలా చూడమని సీఎం ఆదేశించారు అని అన్నారు.ఆయా దేశాల్లో శాస్త్రీయంగా ఉండేలా మొక్కలు నాటుతారు అని అన్నారు.అదే విధానంలో అమరావతిలో కూడా రకరకాల మొక్కలను శాస్త్రీయ విధానంలో నాటేలా చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *