

Mana News :- పాచిపెంట, నవంబర్ 22( మన న్యూస్ ):- పాచిపెంట మండల పరిషత్ పరిధిలో గల దివ్యాంగులకు,సీనియర్ సిటిజన్ లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి అవసరమైన ఉపకరణములు ఇచ్చుటకు గాను సాలూరు మండల పరిషత్ కార్యాలయ పరిధిలో ఈ నెల 26 వ తేది ఉదయం 10 గంటల నుండి ఐడెంటిఫికేషన్ క్యాంప్ నిర్వహించబడునని తెలిపారు.పాచిపెంట మండలములో గల అన్నీ గ్రామ పంచాయతీ,సచివాలయ సిబ్బంది,పంచాయతీ కార్యదర్శులు అందరూ ప్రసార మాధ్యముల ద్వారా దండోరాల ద్వారా మైక్ అనౌన్స్మెంట్ ల ద్వారా మండలములో గల ప్రజలకు, ప్రజాప్రతినిధులకి, నాయకులకు స్వయం సహాయక గ్రూప్ లకు సదరు విషయం విస్తృతముగా ప్రచారం చేయవలసినదిగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేసియున్నారని తెలియజేసారు .