నిజాంసాగర్ : మండలంలోని అచ్చంపేట్ రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కలిసి చేపట్టిన నాణ్యమైన విత్తనం-రైతన్నకు నేస్తం అనే కార్యక్రమంలో రైతుల కు వరి విత్తన చిరు సంచులు అందజేసినట్టు మండల వ్యవసా య అధికారి అమర్ ప్రసాద్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ముగ్గురు రైతులకు అందించా మన్నారు. రైతులు విత్తనాలు సాగుచేసి వచ్చిన ధాన్యంను విత్త నంగా మార్చి తమ గ్రామంలో మిగిలిన రైతులకు తక్కువ ధరకు అందించాలని తెలిపారు.మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు వరి, మొక్కజొన్న చిరు సంచులను మండల వ్యవసాయ అధికారి నవ్య పంపిణీ చేశారు ఈ సందర్భంగా ..ఆమె మాట్లాడుతూ రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓలు మధుసూదన్,రేణుక,
మాజీ ఎంపిటిసి తాటిపల్లి సరస్వతి దేవి,నాయకులు లోక్యా నాయక్,కుమ్మరి రాములు,ఆకాష్,షేక్ మోయిన్,సయ్యద్ రఫిక్, శంకు లక్ష్మయ్య, గజ్జల రాములు,రామకృష్ణ ,రైతులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *