మన న్యూస్, కోవూరు :కోవూరు గ్రామంలో బుద్ధి పద్మావతి కళ్యాణ మండపంలో దేవాంగ సంఘ ఆధ్వర్యంలో 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…. మెరిట్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం చేపట్టిన దేవాంగ సంఘ పెద్దలను ఆమె అభినందించారు. చదువులో అంకితభావం, నిరంతరశ్రమ ఫలితంగానే విద్యార్థినీ, విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారన్నారు.ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే దిశగా దేవాంగ సంఘ పెద్దలు నిర్వహిస్తున్న ఈ సన్మాన కార్యక్రమం ఇతర కుల సంఘాలు స్ఫూర్తిగా తీసుకొని మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోవూరు తహసీల్దారు నిర్మలానంద బాబా, దేవాంగ సంఘ పెద్దలు పిచ్చుక మధు సూధన్ రావు, 12 వార్డు మెంబర్ పిచ్చుక కృష్ణవేణి, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *