మన న్యూస్, కోవూరు, మే 30:- కార్యకర్తల సందడితో మహానాడు పండుగ శోభ సంతరించుకుంది.- తెలుగుదేశం కార్యకర్తల పార్టీ అని నిరూపించారు.- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.అంగరంగ వైభవంగా పండుగ వాతావరంలో జరిగిన మహానాడు విజయవంతంలో టిడిపి కార్యకర్తల పాత్ర కీలకం అన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఒక ప్రకటనలో మహానాడు విజయానికి కృషి చేసిన కోవూరు నియోజకవర్గ టిడిపి క్షేత్ర స్థాయి నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియ చేసారు. పార్టీ పట్ల నిబద్ధత, అంకితభావంతో పని చేస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. మహానాడు స్ఫూర్తిగా కొత్త పాత నాయకులు ఐకమత్యంగా పనిచేసే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానన్నారు. మహానాడు సందర్భంగా స్వచ్ఛందంగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తల ఉత్సాహం కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చాటి చెప్పేలా ఉందని ప్రశంశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *