మా నాన్న (కాకాని గోవర్ధన్ రెడ్డి) ఏ తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలా బయటకు వస్తారు……. కాకాని పూజిత రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, మే 29 :మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత రెడ్డి గురువారం నెల్లూరు లో జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…మా నాన్న కడిగిన ముత్యం లా బయటకు వస్తారు…మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు..ఈ రోజు నుండి ప్రజలకు అందుబాటులో ఉంటా అని అన్నారు.మా తండ్రి అక్రమ అరెస్ట్ పై మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చాను అని అన్నారు.మా తండ్రి నిజాయితీ వ్యక్తిత్వం గురించి ప్రజలకు తెలుసు… అని అన్నారు.అభివృద్ధి,ప్రజల సంక్షేమం తప్ప వేరే ఆలోచన చేయకుండా ఉండే వ్యక్తి మా నాన్న.. అని అన్నారు.కోవిడ్ సమయం లో ప్రజల కోసం 24 గంటలు కష్టపడి పనిచేశారు.. అని అన్నారు. జడ్పీ చైర్మెన్ గా పని చేసి ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి,రెండు సార్లు ఎమ్మెల్యే గా ,ఒక సారి మంత్రిగా పనిచేసిన వ్యక్తి,నాకు ఎవరన్నా ఫోన్ చేసినా మా నాన్న ప్రజల కోసం పనిచేసే వ్యక్తి నేరుగా వెళ్ళి 24 గంటల్లో ఎప్పుడైనా కలవండి అని చెప్పేదాన్ని అని అన్నారు.కింది స్థాయి నుండి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు ప్రజల కష్టాలు తెలుసు… అని అన్నారు.మా తాత నుండి నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాం.. అని అన్నారు.తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి మా నాన్న ను కష్టాలు పెట్టడం సరికాదు … అని అన్నారు.నియోజక వర్గంలో ప్రజలు చాలామంది ఫోన్ చేసి గోవర్ధన్ రెడ్డి పై తప్పుడు కేసులు పెడతారు అని చెప్పేవారు… అని అన్నారు.మా నాన్న పై చాలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి,ఇది బాధాకరం.. అని అన్నారు.కేసులు అనేవి మా నాన్నకు కొత్త కాదు..ఎన్నో సార్లు కేసులు పెట్టినా పోలీసు విచారణ కు హాజరు అయ్యేవారు అని అన్నారు.న్యాయ స్థానం లో బెయిల్ పిటిషన్ రన్ అవుతుంది కాబట్టి న్యాయ స్థానం తీర్పు కోసం ఎదురుచూసాం అని అన్నారు.సుప్రీం కోర్టులో మేమే కేసు కొన్ని సాంకేతిక కారణాలు వలన వెనక్కు తీసుకున్నాం తప్ప బెయిల్ పిటిషన్ కొట్టేయలేదు… అని అన్నారు.కాల చక్రం బలమైంది,ఈ రోజు మా సమయం కాక పోవచ్చు కానీ మాకు ఓ రోజు వస్తుంది.. అని అన్నారు.ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాయకులు,కార్యకర్తలు మాతోనే ఉంటారు అని అన్నారు.మాతో కలిసి ఉన్న అందరికీ ధన్యవాదాలు… అని తెలియజేశారు.మా నాన్న అరెస్ట్ అయినప్పటి నుండి జిల్లా ప్రజలు,సర్వేపల్లి నియోజక ప్రజలు, వైసిపి పార్టీ లోని అందరూ మాకు అండగా ఉన్నారు.. అని అన్నారు.కడిగిన ముత్యం లా మళ్ళీ మా నాన్న ప్రజల ముందుకు వస్తారు… అని అన్నారు.కార్యకర్తలు కు అందరికీ నేను నిత్యం అందుబాటులో ఉంటాను… అని అన్నారు.

  • Related Posts

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచారం మరియు ప్రజా సంబంధాల ఐలాండ్ పిఆర్ శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ అనంతపురం కు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీ…

    గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….

    అమరావతి :(మన ద్యాస న్యూస్ )ప్రతినిది, నాగరాజు,, సెప్టెంబర్ 14 :/// ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వ అరాచక చర్యలను కూటమి ప్రభుత్వం ఉప సంహరించుకోవడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు.అరాచక చర్యలను కూటమి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా