Oplus_16908290

బద్వేల్: మన న్యూస్: మే 29: శాంతి భద్రతులను కాపాడవలసిన పోలీసులే దళితులపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ తెనాలి పట్టణంలో దళితులు రౌడీసీటర్లు అనే నెపముతో వారిని పిలిపించి నడిరోడ్డు పైన పడుకో బెట్టి లాఠీలతో కొట్టడం అనేది సభ్య సమాజంలో సిగ్గుచేటుగా ఉందని, వారన్నారు. దళితులు ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించవలసిన పోలీసులే నడిరోడ్డు పైన వారిని మానసిక శోభకు గురి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారిని ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తెనాలిలో జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిందని దళిత యువకులను తీసుకొని విచక్షణారహితంగా కొట్టడం అనేది మానవ హక్కుల ఉల్లంఘనే అని వారు పేర్కొన్నారు. గతంలో అగ్రకులస్తులు దళితులపై అక్కడక్కడ దాడి చేయడం చూస్తున్నాము, పోలీసులే దళిత యువకులపై కఠినంగా దాడి చేయడం అనేది హేయమైన చర్య. ఈ విషయమై జాతీయ ఎస్సీ కమిషన్ డీజీపీకి నోటీసులు ఇచ్చిన దళిత యువకులకు న్యాయం జరగడంలో ఆలస్యం జరిగే విధంగా ఉందని, వారు పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు స్వర్ణాంధ్ర యుగంగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్లో దళితులపై ఇటువంటి దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య, దళిత సీనియర్ నాయకులు బత్తలకూరి కేశవయ్య, డీఎస్పీఎస్ నాయకులు పి వెంకటరమణ. టి బి ఎఫ్ సీనియర్ నాయకులు చిన్నయ్య.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *