

మన న్యూస్, నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కడపలో జరుగు మహానాడు కు జన సమీకరణ మరియు రవాణా సౌకర్యాలపై నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 29వ తేదీ కడపలో జరిగే మహానాడు భారీ బహిరంగ సభకు నెల్లూరు రూరల్ నుంచి భారీగా జనసమీకరణ చేయాలని నేతలకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచన చేశారు. డివిజన్లు, గ్రామాలవారీగా పలువురు నేతలకు బాధ్యతలు అప్పగించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మహానాడులో పాల్గొనే వారికి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

