

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,మే25: నెల్లూరు రూరల్ ,పద్మావతి సెంటర్ నందు జరుగుతున్న పొదలకూరు రోడ్డు పనులను ఆర్&బి, కార్పొరేషన్,విద్యుత్ మరియు ఇతర అధికారులతో కలిసి పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.గతంలో ఎంతో అధ్వానంగా ఉన్న పొదలకూరు రోడ్డును కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు ప్రారంభించడం జరిగింది.త్వరితగతిన పొదలకూరు రోడ్డు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పొదలకూరు రోడ్డు అభివృద్ధి వలన ఎంతో మంది ప్రజలకు మేలు జరుగుతుంది అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.అద్భుతమైన రోడ్డుతో పాటు సెంట్రల్ డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ పనులతో పొదలకూరు రోడ్డు సర్వంగా సుందరంగా రూపుదిద్దుకుంటుంది అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో స్థానిక నాయకులు,కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

