

మన న్యూస్, నెల్లూరు ,రూరల్ మే 20:నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 20 మందికి మంజూరైన రూ.19లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం బాధితులకు అందజేసిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు పొందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో వైద్యం పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉదారంగా సాయం మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి నా ప్రత్యేక ధన్యవాదములు అని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.

