

మన న్యూస్, పినపాక మండలం పాతరెడ్డిపాలెం గ్రామంలో బుధవారం పశు వైద్య శిబిరం నిర్వహించారు. పశువుల గర్భకోశ వ్యాధులకు సంబంధించి వైద్యురాలు ఉజ్వల రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరకగూడెం వైద్యాధికారిని వాసంతి, గోపాలమిత్ర లు లక్ష్మణరావు, రామ్మోహన్, గోపాలకృష్ణ, సుమన్, ప్రతాప్, రైతులు పాల్గొన్నారు.