

మన న్యూస్,: పినపాక మండల పరిధిలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన బాడిశ ముత్తమ్మ మంగళవారం ఉదయం థమ్స్ బాటిల్ లో ఉన్న గడ్డి మందును శీతల పానీయం(థమ్స్ అప్)గా భావించి సేవించినది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పినపాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మణుగూరు 100 పడకల ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో బాడిశ ముత్తమ్మ చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆసుపత్రికి వెళ్లి బాధితురాలని పరామర్శించారు. ఆసుపత్రి వైద్యులతో బాధితురాలి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి కుటుంబానికి ధైర్యం చెప్పి, అండగా ఉంటానని హామీ ఇచ్చారు.