

మనన్యూస్,తిరుపతిఃబలిజ ఉద్యోగులు, మేధావుల వందో ఆత్మీయ కలయికను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఓ ప్రైవేట్ హోటల్ లో సభాధ్యక్షులు రమణ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ కలయిలో వివిధ శాఖల్లో పని చేసే ఉద్యోగులు, మేధావులు పాల్గొన్నారు. బలిజ సామాజిక వర్గంలో ఐక్యతకు ఇటువంటి ఆత్మీయ కలయికలు ఎంతో ఉపయోగపడుతాయని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా బలిజలు మరింతగా బలపడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా బలిజలు బలపడే క్రమంలో ఇతర సామాజిక వర్గాలతో సఖ్యతగా మెలగి వారి మన్ననలు పొందాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒడుదుడుకులు ఎదురైనా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లాగా నిలబడే ధైర్యం ఉన్న యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వూకా విజయ్ కుమార్, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కోడూరు బాలసుబ్రమణ్యం, సింగంశెట్టి సుబ్బరాయుడు, దేవర మనోహర్, మెరుపుల మహేష్, హైకోర్ట్ బార్ అసోషియేషన్ అధ్యక్షులు చిదంబరం, ఏపి ప్రైవేట్ డిగ్రీ కళాశాల అధ్యక్షులు రమణా జీ తదితరులు పాల్గొన్నారు.