

- తెలుగు యువత అధ్యక్షులు కీర్తి శుభాష్…
శంఖవరం మన న్యూస్ (అపురూప్): ఆడపిల్లలు, మొక్కలు,చెట్లు సమాజ హితులనీ, వీరిని ఆజీవమూ (జీవితాంతం) నిత్యం ప్రత్యేక శ్రద్దతో కాపాడు కోవాల్సిన సామాజిక నైతిక బాధ్యత మన అందరిపైనా విధిగా ఉందని తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షులు, వజ్రకూటం గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి వెంకట సుభాష్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సారధ్యంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరంలోని మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో శంఖవరం సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (శంఖవరం సెక్టార్ ఐసిడిఎస్ ప్రాజెక్టు) ఆధ్వర్యంలో 7 వ పౌష్టికాహార పక్షోత్సవంలో అంతర్భాగంగా పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా బేటి బచావో – బేటి పడావో నినాదంతో ఆడపిల్లల పేరు మీద కొబ్బరి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని కత్తిపూడి సెక్టర్ వజ్రకూటం గ్రామంలోని కండిపల్లి రేష్మ శ్రీ తల్లిదండ్రులు రాజు, వరలక్ష్మి అనే చిన్నారి పేరుతో గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి వెంకట సుభాష్, అంగన్వాడీ కార్యకర్త గ్రామ పెద్దలు సంయుక్తంగా మొక్కను నాటారు.ఈ సందర్భంగా మాజీ గ్రామ సర్పంచ్కి ఎత్తి వెంకట సుభాష్ మాట్లాడుతూ, కుటుంబ వ్యవస్థ నిర్వహణలో, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో తెలిసిందేనని, అటువంటి మహిళలకు మూలమైన బాలికలు ఎంతో ప్రాముఖ్యత కలిగిన వారనీ ఆయన వివరించారు. అందుకే బాలికల పేరు మీద మొక్కలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదనీ, బాలికలనూ మొక్కలను సమ ప్రాధాన్యంంతో పెంచి పోషించి, సంరక్షించు కోవాలని, బాలికలు ఎదిగి సమాజ నిర్మాణంలో మహిళలుగా తమ వంతు శక్తివంతమైన పాత్రను పోషిస్తే, మొక్కలు చెట్లుగా ఎదిగి జీవజాలానికి ప్రాణ వాయువును అందిసైతాయని, ఆ ఆవశ్యకతను నొక్కి చెప్పేందుకే బాలికలకు సారూప్యంగా ప్రభుత్వం మొక్కలను పంపిణీ చేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.