

- ఉగ్ర దాడికి పాల్పడిన వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి…
- జనసేన నేత మేకల కృష్ణ…
శంఖవరం మన న్యూస్ (అపురూప్): జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులు దారుణమని శంఖవరం గ్రామ విశ్వ హిందూ పరిషత్, క్రైస్తవ, ముస్లిం సభ్యులు శుక్రవారం డిమాండ్ చేశారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పహాల్గం పర్యాటకప్రాంతంలో 27మంది భారతీయులను,నేపాల్ పౌరుడిని పాకిస్తాన్ కు చెందిన తీవ్రవాదసంస్థ అన్యాయంగా మతం పేరు అడిగి మరీ కాల్చిచంపి మట్టుపెట్టిన సంఘటన పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాదులను ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్ పై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ శంఖవరం గ్రామానికి చెందిన సర్వమత సభ్యులు శుక్రవారం శంకవరంలో గల తాసిల్దార్ కార్యాలయానికి ర్యాలీగా చేరుకొని తహసిల్దార్ కి వినత పత్రం అందించారు ఈ సందర్భంగా శంకవరం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు మేకల కృష్ణ మాట్లాడుతూ,పాకిస్తాన్ పూర్వపు అఖండ భారతదేశం లో ఒక భాగం దాయాది దేశం అని అయిన భారతదేశంతో స్నేహ సంబంధ కొనసాగించాలి తప్ప లేని శత్రుత్వం కొనసాగించడం పాకిస్తాన్ ప్రభుత్వం మూర్ఖత్వం అని భారతదేశం పట్ల హింస వైఖరిని విడనాడి లౌకికదేశమైన భారతదేశంతో స్నేహసంబంధాలు పెంపొందించుకోవాలని అన్నారు. కావున 28 మంది అమాయకులను అన్యాయంగా కాల్చిచంపిన తీవ్రవాదులపై తగు చర్య తీసుకొని,తీవ్రవాదులకు తగు సహాయ సహకారాలు అందిస్తున్న పాకిస్తాన్ వైఖరిని తీవ్రంగా, కఠినంగా శిక్షించాలని భారతదేశ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ జనసేనపార్టీ అధ్యక్షులు మేకల కృష్ణ, అడపా వెంకటేష్,గ్రామ బిజెపి నాయకులు పడాల నానాజీ, గ్రామ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు జట్లా లక్ష్మణరావు, క్రైస్తవమత సంఘకాపారి పొలమాటి శాంతి భరత్, ముస్లిమ్ మత గురువు సయ్యద్ హుస్సేన్, బిరుదల బాబురావు, కుర్రే మాణిక్యం, సింగులూరి సత్యనారాయణ, పేకేటి గంగరావు,గాది నారాయణరావు, హరేరామ భజన మండలి సభ్యులు సురకాసుల యశోద,కర్రి అమ్మాజీ,బోణం అమ్మాజీ, పాలపర్తి రాములు, అద్దాల పాపాచార్యులు తదితరులు పాల్గొన్నారు.