

కడప జిల్లా: మన న్యూస్: ఏప్రిల్ 26: విజయవాడలోని A1 కన్వెన్షన్ హాలులో జరిగిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో వైఎస్ఆర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు విజయజ్యోతి పాల్గొన్నారు. ఈ సమావేశంలో అహ్మదాబాద్ డిక్లరేషన్ నేపథ్యంలో రాబోయే 40 రోజుల విస్తృత కార్యక్రమాలపై చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమాలు జిల్లా స్థాయి నుండి నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలకు విస్తరించాలని నిర్ణయించబడింది. ప్రజలకు డిక్లరేషన్ లోని అంశాలను చేరవేసే విధంగా కార్యాచరణ రూపొందించేందుకు విజయజ్యోతి ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా, ఇటీవల పహల్గామ్లో జరిగిన దాడులను నిరసిస్తూ జరిగిన క్యాండిల్ ర్యాలీలో ఆమె పాల్గొని, ఆగమన దాడులను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై దేశం మొత్తం ఒకటిగా నిలబడి పోరాడాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.