

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్కేబి బ్రాయిలర్ చికెన్ సెంటర్ మౌలాలి తన మానవత్వాన్ని చాటుకొని ఒక నెల రోజులపాటు చలివేంద్రం వద్ద మంచినీటిని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి శుక్రవారం 4,00 మందికి పైగా మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని మౌలాలి చేపట్టడం సంతోషకరమని శ్రీ కోదండరామస్వామి దేవాలయం అధ్యక్షులు పేర్ల జనార్దన్ రావు, ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కె,వి సుబ్బారావు, చెన్నంపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పబ్బతి చక్రపాణి, తో పాటు పలువురు అభినందించారు. శుక్రవారం మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద సుమారు 400 మంది పైగా మౌలాలి సహకారంతో మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించిన మౌలాలికి పలువురు శాలువాతో సత్కరించి వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు, అనంతరం వారు మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు చలివేంద్రాల వద్ద ఒక నెల రోజులు పాటు మంచినీటి ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి శుక్రవారం ప్రజలకు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఎస్కేబి బ్రాయిలర్ చికెన్ యాజమాని మౌలాలి ఏర్పాటు చేయడం అభినందనీయం అని వారు అన్నారు.