

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్:
కూటమి ప్రభుత్వం ద్వారానే రైతులకు మేలు చేకూరుతుందని సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇళ్ల అప్పారావు అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాలతో మండలంలో ఉన్న ఏలూరు వెంకటపతి రాజు చెరువు దగ్గర నుండి ప్రత్తిపాడు వరకు తొమ్మిది కిలోమీటర్లు పొడవున కాలువలు పూడిక తీత అభివృద్ధి పనులకు సుబ్బారెడ్డి సాగర్ ఛైర్మెన్ ఇళ్ల అప్పారావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో ఏలూరు సర్పంచ్ రొంగల సత్యనారాయణ,టి.రాయవరం సర్పంచ్ తట్టవర్తి సుబ్బారావు,అడ్డాల త్రిమూర్తులు,మదినే వెంకన్నదొర,కొట్టేటి అబ్బులు,ఇరిగేషన్ డిఈ రాజేంద్ర ప్రసాద్,జెఈ ఇబ్రహీం, ప్రత్తిపాడు నీటి సంఘ డైరెక్టర్లు వనపర్తి భద్రం,సింగిలిదేవి సత్తిబాబు,పల్లిబోయిన వెంకటరమణ,టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.