

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పెహల్గామ్ ఉగ్ర దాడిలో అమరులైన వారికి కన్నీటి వీడ్కోలు తెలపాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జన సైనికులు మూడు రోజులు పాటు కన్నీటి వీడ్కోలు అనే కార్యక్రమం చేపట్టారు.దీనిలో భాగంగా శుక్రవారం మండల కేంద్రమైన ఏలేశ్వరంలో జనసేన నాయకులు మేడిశెట్టి కిరణ్ ( బాబి ),పెంటకోట మోహన్ ల ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదుల పైశాచికత్వానికి బలైపోయిన టూరిస్టుల ఆత్మకు శాంతి కలగాలని పెంపొందించాలని జయంతో కన్నీటి వీడ్కోలేని కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.మూడు రోజులు పాటు చేపట్టిన సంతాప కార్యక్రమంలో బుధవారం జిల్లా కేంద్రం కాకినాడలోనూ,గురువారం నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడులోనూ శుక్రవారం మండల కేంద్రమైన ఏలేశ్వరం లోను జన సైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర మూకల అరాచకత్వాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు.పాకిస్తాన్ ఉగ్రవాదుల దుశ్చర్యలను భారతదేశంతో పాటు యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించింది అన్నారు.ఉగ్రదాడికి పాల్పడిన వారిని సరైన రీతిలో బుద్ధి చెప్పి ఇలాంటి దృశ్చర్యలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతుందన్నారు.ఇలాంటి ప్రమాదకర పరిస్థితిలో పార్టీలకతీతంగా భారతీయులందరూ ఏకతాటిపైకి వచ్చి ఉగ్ర మూకల దుశ్చర్యాలను ఖండించాలన్నారు.ఈ కార్యక్రమానికి జనసైనికులు మేడిశెట్టి సూర్యకిరణ్(బాబి),ఎండి అధికార,మసిరపు నాగేశ్వరరావు,పొట్ట సత్యనారాయణ,కరణం సుబ్రహ్మణ్యం,దళే జ్యోతి,గాబు సుభాష్,దాసం శేషగిరిరావు,మేకల కృష్ణ,నాయకత్వం వహించారు.