

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: ఉగ్రవాదుల చర్యలను భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని సిపిఐ బద్వేలు మండల కార్యదర్శి నాగదాసరి ఇమ్మానుయేలు సిపిఐ జిల్లా సమితి సభ్యులు పడిగేవెంకటరమణ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఎద్దుల ఈశ్వర్ రెడ్డి కాలనీలో జమ్మూ కాశ్మీర్ పహాల్గం లో ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ , దాడిలో చనిపోయిన వారికి కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటిస్తున్న సిపిఐ బద్వేల్ మండల సమితి. ఈ సందర్భంగా మండల కార్యదర్శి నాగ దాసరి ఇమ్మానుయేలు మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి పెరికిపంద చర్యని ఇలాంటి క్రూరమైన దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారన్నారు ప్రజల పైన తుపాకీ తూటాలు ఎక్కు పెట్టడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా జమ్ము కాశ్మీర్ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు ఉగ్రవాదుల దాడిలో బలైన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు. సుబ్బారెడ్డి సుధాకర్ బ్రహ్మయ్య రాజశేఖర్ ప్రసాదు ఎబిరం వెంకటేష్ వీరయ్య టైటానిక్మ హిళా నాయకులు తిరుమల అయ్యవామ్మ మునెమ్మ దేవి పెదరామక్క కృప తదితరులు పాల్గొన్నారు.