

మన న్యూస్, వెదురుకుప్పం :- వెదురుకుప్పం కార్వేటినగరం సీనియర్ జర్నలిస్టులు శనివారం జాతీయ పత్రికాదినోత్సవం సందర్భంగా రాష్ట్ర మరియు జిల్లా ఏపీయూడబ్ల్యూజే వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు జర్నలిస్టు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వెదురుకుప్పం మండల పరిషత్ సూపెరిండెంట్ నాగమణి, ఎస్సై వెంకటసుబ్బయ్య కు ఎపియుడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు గోవింద్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికి ఇంటి స్థలాలు మూడు సెంట్లు కేటాయించి ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వమే నిర్మించే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆదేవిదంగా గతంలో జర్నలిస్టులపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని అన్నారు. జర్నలిస్టుల కోసం నూతనంగా రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు. జర్నలిస్టులకు వయోపరిమితి ప్రకారం పింఛన్ అందించాలన్నారు. ప్రజాస్వామ్యం లో జర్నలిస్టుల కు కల్పించిన హక్కుల్ని, చట్టాలను పరిరక్షణ చేసి జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేసారు. అనంతరం పచ్ఛికాపల్లం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రోగులకు రొట్టెలు, పళ్ళు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో సినియర్ జర్నలిస్టులు పన్నూరు రవి, పుల్లూరు రఘునాథ రెడ్డి, గోవింద్ స్వామి, విజయ కుమార్, వరదారెడ్డి, దేవరాజులు, రాజా, వినోద్, ప్రశాంత్, జయచంద్రా రెడ్డి, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.
