

ఎస్ఆర్ పురం నవంబర్ 16 మన న్యూస్
ఎస్ఆర్ పురం లో ఘనంగా పత్రికా దినోత్సవం వేడుకలుపత్రికా విలువను కాపాడుతూ నవ సమాజ నిర్మాణానికి ముందుకు వేయండి.. ఎస్సై సుమన్మనన్యూస్ ,ఎస్ఆర్ పురం పత్రిక విలువను కాపాడుతూ నవ సమాజ నిర్మాణానికి ముందుకు అడుగులు వేయండి అని ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్ తెలిపారు. శనివారం ఎస్ఆర్ పురం మండల కార్యాలయం వద్ద జాతీయ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఆర్ పురం మండల ఎస్సై సుమన్, ఎంపీడీవో మోహన్ మురళి పాల్గొన్నారు. ఎస్ఆర్ పురం మండల పత్రిక విలేకరులు లతో జాతీయపత్రిక స్వేచ్ఛ దినోత్సవం కేక్ ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఎస్సై సుమన్ మాట్లాడుతూ ప్రజలకు అధికారులకు వారధిగా ఉంటూ పత్రిక స్వేచ్ఛను కాపాడుతూ ముందుకు నడవాలని మీడియా పత్రికా విలేకరులకు తెలియజేశారు. త్వరలో ఎస్ ఆర్ పురం మండలం కార్యాలయం పరిధిలో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు అధికారులు కృషి చేస్తామని పత్రిక విలేకరులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పత్రిక విలేకరులు తిరుమల, నరేష్, వెంకటేష్ కంద స్వామి,మునికృష్ణ బాలాజీ సతీష్ సాఫ్ట్వేర్ బాలు సంఘమిత్ర శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.