గిరిజన చట్టాలను కాలరాస్తున్న పాలకులు,,సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు

మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట ఆదివాసి గిరిజన సంఘం నాయకులు. మజ్జి కృష్ణమూర్తి అధ్యక్షతన గిరిజన చట్టాలు కాలరాస్తున్న పాలకులు అనే అంశం పైన పాచిపెంట మండలం సరాయివలస జంక్షన్ వద్ద జరిగింది.ఈ సదస్సును ఉద్దేశించి.సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా మారని గిరిజన బతుకులని ఆవేదన వ్యక్తం చేశారు.నేటికీ డోలిమాతలు తప్పడం లేదని పూర్తిస్థాయిలో రహదాల నిర్మాణం జరగటంలేదని ఇంకా తాగునీటి వంటి మూలిక సదుపాయాలు ఇల్లు నిర్మాణాలు సంబంధించిన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. పోరాడిసాధించుకున్నటువంటి చట్టాలు నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వాటికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడం జరుగుతోందని,అందువలన నాన్ షెడ్యూలు గ్రామాలను షెడ్యూలు గ్రామాలుగా చేర్చడం లేదని వీసా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయలేదని, దీని కారణంగా ఏజెన్సీ సాలూరు, మక్కువ, పాచిపెంట,అలాగే మన్యం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ప్రభుత్వ ఢీ పట్టా భూములను కూడా కాజేస్తున్నారని దీనిపై సమగ్ర సర్వేలు జరిపి పేదల భూములు పేదలకు పంపిణీ చేయాలని అన్నారు. తాతల కాలం నుండి సాగు చేస్తున్న 48 సర్వేనెంబర్ 782 ఎకరాలు కుడుమూరు భూములకు సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాలు మంజూరు చేయాలని ఇంకా పోరాటం కొనసాగుతూనే ఉందని అయినా పాలకులు పట్టించుకోలేదని అన్నారు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇమ్మంటే గిరిజనులకు అందించకుండా కాలయాపన చేయడం వలన ఆ భూములన్నీ కూడా, అన్యాక్రాంతమవుతున్నాయని మొన్న జరిగిన రీ సర్వేలో అనేక అవకతవకలు గిరిజన భూములను అన్యాక్రాంతం విషం పైన బయటపడ్డాయని అన్నారు.అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాలు చొప్పున పట్టాలు ఇవ్వాల్సి ఉన్న అలా జరగడం లేదని అడివి మీద హక్కు కోసం అనేక పోరాటాలు కొమరం భీం నాయకత్వంలో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో శ్రీకాకుళం గిరిజన ఉద్యమ పోరాటాల్లో అనేకమంది వీరులు త్యాగాలు ఫలితంగా,కొన్ని హక్కులు సాధించుకోవడం జరిగిందనిసాధించినటువంటి చట్టాలు కాలరాస్తున్నారని 2005 సంవత్సరంలో వచ్చినటువంటి ఎర్రజెండా నాయకత్వంలో అటువాకుల చట్టం ఉపాధి హామీ చట్టం విద్యాహక్కుల చట్టం అనేక గిరిజన చట్టాలన్నీ కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం కాల రాస్తుంటే అడవుల్ని కొండల్ని పర్వతాలని కార్పొరేట్ గా అప్పజెప్తుంటే కూటమి ప్రభుత్వం ప్రభుత్వం వారికి అండగా నిలబడి గిరిజనుల పైన దళితులపైన దాడులు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ వై నాయుడు మాట్లాడుతూ పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి గిరిజన చట్టాలతో పాటు ముఖ్యంగా జిసిసి గిరిజన కార్పొరేషన్ ద్వారా గిరిజనుల పండించిన అటవీ ఉత్పత్తులు చింతపండు, జీడి కాఫీ రబ్బరు కాగు కుంకుడుకాయలు, వంటి అనేక అటవీ ఉత్పత్తులను గిరిజన కార్పొరేషన్ కొనుగోలు చేయకపోవడం వలన దళారీలు బారిన పడి గిరిజల్లు తీవ్రంగా నష్టపోతున్నారని జి సి ని సమర్థవంతంగా నడిపించే పని ప్రభుత్వాలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు అనేక ప్రాంతాల్లో మూతలు పడ్డాయని వాటిని తెరిపించి మరల విద్యాభివృద్ధి కోసం కృషి చేయాలని మూడు నాలుగు తరగతిలో విలీనం పేరుతో అనేక స్కూల్లు మూతలు పడుతున్నాయని ముఖ్యంగా గిరిజన పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారని దీనివలన గిరిజన ప్రాంతం మరింత వెనకబడిపోతుందని అన్నారు. ఇటీవల కాలంలో అనేకమంది గిరిజనులు చేపలు రొయ్యలు చెరువులు పనులు కోసం ఉపాధి కోసం బతకడానికి ఎక్కడెక్కడికో వెళ్లిపోయి అనేక చోట్ల మరణాలు సంభవించే పరిస్థితి ఏర్పడిందని.ఇటువంటి పరిస్థితుల్లో గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం అధికారులు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. కేరళ తరహాలో నిత్యసర సరుకులు పూర్తిస్థాయిలో పేదలకు అందించాలని అలాగే జిసిసి ద్వారా గిరిజనులకు పూర్తిస్థాయిలో నిత్యవసర వస్తువులన్నీ సరసమైన ధరలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు .రాయిపోర్టు విశాఖ పోర్టు వరకు 22 వేల కోట్లతో రహదారి నిర్మాణం వేగవంతం చేస్తున్నారని అదే గిరిజన ప్రాంతాల్లో రహదారి నిర్మాణ స్వీకారం శ్రద్ధ పెట్టడం లేదని ఈ రోడ్డు కార్పొరేట్లకు లాభం తప్ప సామాన్య ప్రజలకు రైతాంగానికి ఎటువంటి ఉపయోగం లేదని కొండల్ని ఘనుల్ని పర్వతాలను సేకరించి ఓడరేవుల ద్వారా ఇతర దేశాలకు తరలించి కోట్ల రూపాయలు లాభాలు పొందేందుకు ఇటువంటి రహదారులు వేస్తున్నారని కానీ నేటికీ కూడా పూర్తిస్థాయిలో గిరిజన ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఇటువంటి పరిస్థితుల్లో గిరిజన అంతా ఐక్యంగా ఉద్యమించి పోరాడి హక్కుల కోసం నిలబడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సుర్రు రామారావు గిరిజన సంఘం నాయకులు పెదరామయ్య, చింత రాంబాబు, కొట్టిస శంకర్రావు, కే లక్ష్మి సిపిఎం నాయకులు కోరాడ ఈశ్వరరావు మరియు గిరిజనులు పాల్గొన్నారు.

  • Related Posts

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా