

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 15:
అగ్నిమాపక వారోత్సవాలు 2025 సందర్బంగా రెండవ రోజు భాగంగా అగ్నిమాపక ఆఫీసర్ చంద్రుడు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని ఫైర్ సిబ్బంది ద్వారా పలు రకాల విన్యాసాలతో అవగాహన కల్పించారు. అనంతరం బస్టాండ్ ప్రాంతంలోని కంట్రోలర్ ప్రసాద్ గారు, RTC సిబ్బంది మరియు ప్రయాణికులకు అగ్ని ప్రమాదాల వారోత్సవాల పత్రికలను అందజేశారు,వారికి అగ్ని ప్రమాదాల జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వివరించి, అగ్నిమాపక విన్యాసాలు చేసి వారోత్సవాల కరపత్రాలను పంచి, అగ్నిమాపక పరికరాల ప్రాముఖ్యతను తెలిపి, అదే విధంగా వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తలు వివరించడమైంది. ఈ కార్యమంలో ప్రయాణికులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొనడం జరిగినది.