

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 13: చదువుకున్న అజ్ఞానిగా ఎప్పుడు ఉండకూడదని విద్యార్థులు వివేకంతో మెలగాలని మేజర్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మేజర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం బద్వేల్ పట్టణంలోని శ్రీ రాచపూడి నాగభూషణం కళాశాల 28వ వార్షికోత్సవ వేడుకలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విలువలతో కూడిన విద్యనభ్యసించాలంటే మంచి గురువుల అవసరం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికి ఒక రోజు తప్పకుండా ఉంటుందని దానికోసం కష్టపడుతూ ఎదురు చూడాలని ఆయన తెలిపారు. కింద పడిన ప్రతిసారి ఎక్కువ ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి మెదడుకి పదును పెట్టాలని అప్పుడే అద్భుతాలు జరుగుతాయని ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిధిగా విచ్చేసిన 2023 యూపీఎస్సీ ఆల్ ఇండియా 783 ర్యాంక్ ఐ.ఆర్.ఎం.ఎస్. ఎం ఉదయ్ కృష్ణారెడ్డి అన్నారు. చదువుతోపాటు డిటర్మినేషన్, క్రమశిక్షణ తప్పక అవసరమని ఆయన అన్నారు. ప్రపంచంలో గొప్ప వాళ్ళ విజయ గాధలు విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతాయని ఆయన అన్నారు.