భావితరాలకు ఆదర్శప్రాయుడు బాబూ జగజీవన్ రామ్గూ డూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్.

మనన్యూస్,గూడూరు:భారతదేశానికి బాబు జగజీవన్ రామ్ సేవలు మరువలేనివి గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా.పేద బడుగు దళితుల కోసం చట్టాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్:ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్
బాబు జగజ్జివన్ రావు ఆశయాలను ఆలోచనల స్ఫూర్తిగా యువత ముందుకు సాగాలి : గూడూరు ఎమ్మార్వో చంద్రశేఖర్
దళితుల అభ్యున్నతి కోసం అహర్నిశలు పనిచేస్తాను చిల్లకూరు ఎమ్మార్వో శ్రీనివాసులు.
తిరుపతి జిల్లా గూడూరులో గూడూరు డివిజన్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు వేడుకలు ముఖ్య అతిథులుగా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ విచ్చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా టవర్ క్లాక్ సెంటర్లో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ నిర్వహణ కమిటీ ఏర్పాటుచేసిన శిబిరంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ మాట్లాడుతూ….. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ భారతదేశ మాజీ ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఆహార భద్రత రైల్వే శాఖ మంత్రిగా పనిచేసే భారతదేశ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తి అని అన్నారు. భావితరాలకు ఎంతో ఆదర్శప్రాయుడని ఆయన ఆశయాలు ఆలోచనలకు పూర్తిగా తీసుకొని అభివృద్ధి చేస్తానన్నారు.గూడూరు లో బాబూ జగజ్జీవన్ రామ్ భవనం ఇప్పటివరకు లేదని, గూడూరు సబ్ కలెక్టర్ సహకారంతో గూడూరులో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఏర్పాట అయ్యేలా కృషి చేస్తానన్నారు. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ, బాబు జగజీవన్ రామ్ పేద కుటుంబంలో పుట్టిన ప్పటికీ ఎంతో కష్టపడి చదివి ఎన్నో పదవులు అలంకరించిన వ్యక్తి అని, పేద బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కష్టపడిన పని చేసిన మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు మేరిగ మురళీధర్ మాట్లాడుతూ, డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చిన్నతనం నుంచి మంచి ఆశయాలతో కష్టపడి చదువుకొని ఆ రోజుల్లో అతి చిన్న వయసులోనే కేంద్రమంత్రి పదవుల అలంకరించిన వ్యక్తిగా చరిత్రకి ఎక్కారన్నారు. కేంద్ర మంత్రి పదవులు అలంకరించినా, అందరి మన్ననలు అందుకొని, గొప్ప ఆలోచనలతో భారతదేశఅభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని అన్నారు. అటువంటి మహానుభావుని పూర్తిగా తీసుకొని పనిచేస్తానన్నారు. బాబు జగజ్జివన్ రావు ఆశయాలను, ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని, అప్పుడు దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని గూడూరు తహసీల్దార్ చంద్రశేఖర్ తెలియజేశారు. దళితుల అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం, తాను ఈ వృత్తిలో ఉన్నంతవరకు పనిచేస్తాను అని చిల్లకూరు మండల తాసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు. పలువురు నాయకులు బాబు జగజ్జీవన్ రామ్ గురించి తమ సందేశాలను అందించారు. అనంతరం తన జీవితంలోఎన్నో పోరాటాలు చేసి, ఉద్యమాల కోసం ఎంతో కష్టపడి పనిచేసిన నాగిపోగు సుందరం మాదిగను, గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఘనంగా సత్కరించారు. బాబు జగజీవన్ రామ్ నిర్వహణ కమిటీ సభ్యులు గూడూరు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ని, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాని,శాలువా లతో, పూల బొకేలతో సత్కరించారు. అనంతరం 400 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. జయంతి సందర్భంగా, మహిళలకు బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోటీడీపీ గూడూరు పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు వాటంబేడు శివకుమార్, వైసిపి పట్టణ అధ్యక్షులు గుమ్మడి శ్రీనివాసులు, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదూరు రత్నం మాదిగ, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఆదూరు దామోదర్ మాదిగ, ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యాలపల్లి శ్రీనివాసులు మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నాగబాబు సుందరం మాదిగ, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు గోవింద శంకరయ్య మాదిగ,నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పోలేపల్లి రమణారావు మాదిగ, ఏపీ ఎమ్మార్పీఎస్ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల రవికుమార్ మాదిగ, ఏపీ ఎమ్మార్పీఎస్ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కడింపాటి పౌలు మాదిగ, కురుగొండ నాగరాజు, కొండాపురం శ్రీనివాసులు మాదిగ, పాల్గొన్నారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 2 views
    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 8 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్